Jagan: ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటా: జగన్

Jagan wishes on Rakhi Pournami
  • అక్కచెల్లెమ్మలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన జగన్
  • ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని ఆకాంక్ష
  • కుటుంబాలకు మంచి భవిష్యత్తును అందించడంలో అక్కచెల్లెమ్మలదే కీలక పాత్ర అని వ్యాఖ్య
దేశ వ్యాప్తంగా సోదర సోదరీమణులంతా రాఖీ పండుగ జరుపుకుంటున్నారు. సోదరులకు అక్కాచెల్లెళ్లు రాఖీలు కట్టి తమ అనురాగాన్ని చాటుకుంటున్నారు. జీవితాంతం రక్షగా ఉంటామని వారికి అన్నాతమ్ముళ్లు భరోసా ఇస్తున్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ రక్షాబంధన్ సందర్భంగా ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 'నా అక్కచెల్లెమ్మలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మీరు మరింత ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రయాణంలో ఎల్లప్పుడూ మీకు నేను తోడుగా ఉంటాను. కుటుంబాలకు మంచి భవిష్యత్తును అందించడంలో అక్కచెల్లెమ్మల పాత్ర కీలకమని నేను బలంగా నమ్ముతాను' అని జగన్ ట్వీట్ చేశారు.
Jagan
YSRCP
Rakhi

More Telugu News