ఎయిర్ ఇండియా ఎయిర్ హోస్టెస్‌పై లండన్ హోటల్‌లో ఆగంతకుడి దాడి
- రాడిసన్ రెడ్ హోటల్‌లో బస చేసిన ఎయిర్ హోస్టెస్
- ఆమె గదిలోకి ప్రవేశించి దాడి చేసిన ఆగంతకుడు
- ఆమె అరుపులు విని రక్షించిన సహచరులు
- ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఎయిర్ ఇండియా
ఆమె అరుపులు విన్న పక్క గదిలోని సహచరులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఆమెను రక్షించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా విచారం వ్యక్తం చేసింది. ఈ హోటల్‌లో భద్రతపై గతంలోనూ తాము ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిపింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొంది. కాగా, బాధితురాలిపై లైంగిక దాడి జరిగిందా? లేదా? అన్న విషయాన్ని ఎయిర్ లైన్స్ వెల్లడించలేదు.
ఈ ఘటనపై కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ స్పందించారు. ఎయిర్ హోస్టెస్‌పై ఆగంతకుడి దాడి తనను కలవరానికి గురిచేసిందని అన్నారు. సిబ్బంది భద్రతను ఎయిర్ ఇండియా పట్టించుకోకుండా వారిని ప్రమాదంలోకి నెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.