రూ.2 లక్షలు పైబడిన వారికి కూడా రుణమాఫీ చేస్తాం: తుమ్మల కీలక వ్యాఖ్యలు
- ఏదైనా కారణంతో రుణమాఫీ జరగకపోతే వివరాలు సేకరిస్తామన్న తుమ్మల
- రుణమాఫీ సమస్యలు ఉంటే బ్యాంకు, నోడల్ అధికారులను సంప్రదించాలని సూచన
- గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బకాయిలను చెల్లించినట్లు వెల్లడి
శనివారం నల్గొండలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రూ.2 లక్షల లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేశామన్నారు. ఇప్పటి వరకు 22 లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ చేశామన్నారు. రూ.17,933 కోట్ల నిధులు విడుదల చేసినట్లు చెప్పారు.
రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం రూ.26,140 కోట్లు ఖర్చు చేసిందన్నారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బకాయిలన్నీ చెల్లించామని తెలిపారు. సూక్ష్మసేద్యం, ఆయిల్‌పామ్, పలు రాయితీ బకాయిలు చెల్లించామన్నారు. తమది చేతల ప్రభుత్వమని, దిగజారుడు రాజకీయాలు తమకు రావన్నారు.