Nara Lokesh: ఆమెకు స‌త్వ‌ర న్యాయం జ‌ర‌గాలి.. కోల్‌క‌తా హ‌త్యాచార ఘ‌ట‌న‌పై నారా లోకేశ్ ట్వీట్‌!

Nara Lokesh Tweet on Kolkata Rape Incident
కోల్‌కతాలో జరిగిన వైద్య విద్యార్థిని హ‌త్యాచార ఘటన యావత్ దేశాన్ని క‌లిచివేసింది. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై తాజాగా 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఏపీ మంత్రి నారా లోకేశ్‌ స్పందించారు. ఆమెపై జ‌రిగిన దారుణాన్ని త‌ల‌చుకుంటే మాట‌లు రావ‌డంలేద‌ని, బాధితురాలికి స‌త్వ‌ర న్యాయం జ‌ర‌గాల‌ని లోకేశ్ ట్వీట్ చేశారు. 

"ఆ యువ వైద్యురాలు పడిన బాధను తలచుకుంటే మాట‌లు రావ‌డంలేదు. ఈ క్రూరత్వానికి ఏ ఖండన లేదు. న్యాయం వేగంగా, నిర్ణయాత్మకంగా, ఆదర్శప్రాయంగా ఉండాలి. బాధితురాలి కుటుంబానికి, ఆమెకు న్యాయం చేయాలని కోరుతున్న వారందరికీ నేను సంఘీభావం తెలుపుతున్నాను. ప్రతి మహిళకు భద్రత, గౌరవాన్ని ఇవ్వ‌డానికి మనం ఐక్యంగా ఉండాలి. మంచి మనిషిగా ఉండడమే అత్యంత ప్రభావవంతమైన నిరసన... అబ్బాయిలు, పురుషులందరికీ నా సందేశం ఇదే! ఇది అంద‌రి పోరాటం కావాలి" అని లోకేశ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.
Nara Lokesh
Kolkata Rape Incident
Andhra Pradesh
TDP

More Telugu News