Ram Gopal Varma: ఒక పార్టీకి హాజరైతే సన్నీలియోన్ రూ. 25 లక్షలు తీసుకుంటుంది: రామ్ గోపాల్ వర్మ

Sunny Leone takes 25 laks to attend a birthday party says Ram Gopal Varma
  • శ్రీమంతుల ఇళ్లలో జరిగే వేడుకలకు సెలబ్రిటీలు
  • డబ్బులు తీసుకుని వెళ్తారంటూ చర్చ
  • సెలబ్రిటీలు డబ్బులు తీసుకోవడం నిజమేనన్న వర్మ
ఏ విషయం గురించయినా తన అభిప్రాయాలను కుండ బద్దలుకొట్టినట్టు వెల్లడించడం సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నైజం. సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటానికి కూడా ఆయన వెనుకాడరు. తాజాగా పెళ్లిళ్లు, పార్టీలకు సెలబ్రిటీలు వెళ్తుండటంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

శ్రీమంతుల ఇళ్లలో జరిగే వేడుకలకు సెలబ్రిటీలు వెళ్లడం సాధారణ విషయమే. సెలబ్రిటీలు తమ వేడుకలకు హాజరవడాన్ని కూడా అందరూ గొప్పగా చెప్పుకుంటారు. ఇటీవల ముఖేశ్ అంబానీ కొడుకు వివాహానికి హాలీవుడ్ నుంచి దక్షిణాది సినీ పరిశ్రమ వరకు సెలబ్రిటీలు క్యూ కట్టారు. ఇలాంటి వేడుకలకు హాజరు కావడానికి సెలబ్రిటీలు డబ్బులు తీసుకుంటారనే చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. 

ఈ అంశంపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ... సెలబ్రిటీలు డబ్బులు తీసుకోవడం నిజమేనని చెప్పారు. బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ ఒక్క బర్త్ డే పార్టీకి హాజరైతే రూ. 25 లక్షలు తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.
Ram Gopal Varma
Sunny Leone
Bollywood
Tollywood

More Telugu News