Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం... రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

IMD red alert to Hyderabad
  • హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం
  • హైదరాబాద్‌లో డ్రైనేజీ పొంగి రోడ్డు మీదకు వచ్చిన నీరు
  • వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయి వాహనదారుల ఇబ్బందులు
హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, తిరుమలగిరి, బొల్లారం, ప్యారడైజ్, బేగంపేట, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, గండి మైసమ్మ, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, అమీర్‌పేట, జూబ్లీహిల్స్, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, బాలానగర్, కోఠి, ఆబిడ్స్, హిమాయత్ నగర్, చిక్కడపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

భారీ వర్షంతో హైదరాబాద్ నగరంలోని చాలా రోడ్లు నీటితో నిండిపోయాయి. కొన్నిచోట్ల డ్రైనేజీలు పొంగి రోడ్డు మీదకు మురుగు నీరు వచ్చింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. చాలాచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. గచ్చిబౌలి, అమీర్‌పేట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, బయోడైవర్సిటీ క్రాస్ వద్ద వాహనాలు బారులుతీరాయి.
 
ఈరోజు రాత్రి... మరికొన్ని గంటల్లో నగరంలో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు నగరవాసులకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అత్యవసర పరిస్థితుల్లో 040-21111111కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.
Hyderabad
Telangana
Rain

More Telugu News