Chandrababu: ఢిల్లీ చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

Chandrababu arrives New Delhi for two days visit
  • ఢిల్లీలో చంద్రబాబు రెండ్రోజుల పర్యటన
  • నేడు జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ... ఎంపీలతో విందు
  • రేపు ప్రధాని మోదీ, నిర్మలా, అమిత్ షాలతో విడివిడిగా సమావేశాలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆయన కొద్దిసేపటి కిందట ఢిల్లీ చేరుకున్నారు. ఈ రాత్రి 7 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశం కానున్నారు. ఆయనతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై చర్చించనున్నారు. అనంతరం తమ ఎంపీలతో విందులో పాల్గొననున్నారు. 

చంద్రబాబు ఢిల్లీ పర్యటన రేపు (ఆగస్టు 17) కూడా కొనసాగనుంది. శనివారం సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అనంతరం, సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలవనున్నారు. రాత్రి 7 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. 

రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులు, విభజన అంశాలు, తాజా పరిస్థితులపై కేంద్రం పెద్దలతో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.
Chandrababu
New Delhi
NDA
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News