రష్యాలోని పట్టణాన్ని ఆక్రమించిన ఉక్రెయిన్
- సుద్జా పట్టణం తమ నియంత్రణలోనే ఉందని ప్రకటన
- టౌన్ లో మిలటరీ కమాండర్ కార్యాలయం ఏర్పాటుకు ప్రయత్నాలు
- సుద్జాకు 45 కి.మీ. దూరంలోని గ్లుష్కోవ్ వైపుగా కదులుతున్న ఉక్రెయిన్ ఆర్మీ
సుద్జాపై పట్టుకోల్పోయిన తర్వాత రష్యా అప్రమత్తమైంది. ముందుకు వస్తున్న ఉక్రెయిన్ బలగాలను అడ్డుకోవడానికి ఓవైపు చర్యలు చేపడుతూనే గ్లుష్కోవ్ ప్రాంతంలోని ప్రజలను ఖాళీ చేయిస్తోంది. ఈమేరకు కస్క్ గవర్నర్ అలెక్సీ స్మిర్నోవ్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. సుద్జా నుంచి ఉక్రెయిన్ బలగాలు ముందుకే వస్తున్నట్లు కస్క్ గవర్నర్ తాజా ఆదేశాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు, ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో రష్యాలోని బొరిసోగ్లెబ్‌స్క్, సావస్లీకా వైమానిక స్థావరాల్లోని రెండు హ్యాంగర్లు దెబ్బతిన్నట్లు శాటిలైట్ చిత్రాలతో బయటపడింది.