టోకెన్ తీసుకుని అన్న క్యాంటీన్ లో భోజనం చేసిన చంద్రబాబు దంపతులు
- గుడివాడలో క్యాంటీన్ ప్రారంభించి ఆహారం వడ్డించిన ఏపీ సీఎం
- రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్ల ఏర్పాటు
- రూ. కోటి విరాళం అందజేసిన నారా భువనేశ్వరి
అంతకుముందు ముఖ్యమంత్రి దంపతులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. గురువారం గుడివాడలో క్యాంటీన్ ప్రారంభం కాగా.. మిగతా 99 క్యాంటీన్లను శుక్రవారం ప్రారంభించనున్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా నిరుపేదలు రూ.5 లకే కడుపు నింపుకోవచ్చని, ఇది బృహత్తర కార్యక్రమమని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి భువనేశ్వరి బుధవారం రూ. కోటి విరాళం అందించిన విషయం తెలిసిందే.