Trump Musk: నడి రోడ్డు మీద ట్రంప్, మస్క్ అదిరిపోయే డాన్స్.. ఏఐ వీడియో ఇదిగో!

Trump Musk Groove To Bee Gees Stayin Alive In AI Video Now Viral
  • అమెరికా సెనేటర్ వీడియో ట్వీట్ ను రీట్వీట్ చేసిన మస్క్
  • మా డ్యాన్స్ ఎలా ఉందంటూ ఫాలోవర్లకు ప్రశ్న
  • ఏఐ వల్ల నిజమేదో అవాస్తవమేదో తెలయడం లేదంటున్న నెటిజన్లు
ఒకరేమో అమెరికా మాజీ అధ్యక్షుడు, మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న పవర్ ఫుల్ లీడర్.. మరొకరేమో ప్రపంచ కుబేరులలో ఒకరిగా పేరొందిన వ్యాపారవేత్త.. ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తే, అది కూడా నడి రోడ్డు మీద చేస్తే ఎలా ఉంటుంది?.. అలా జరిగే ఛాన్సే లేదు కదా. అయితే, కృత్రిమ మేధ పుణ్యమా అని ఇలాంటివి సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. ‘స్టే ఇన్ అలైవ్’ పాటకు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ అదిరిపోయే స్టెప్పులేసినట్లు వీడియో సృష్టించి సోషల్ మీడియాలో వదిలారు. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ ను ప్రచారం కోసం ఎలాన్ మస్క్ ఇటీవలే ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూ నేపథ్యంలోనే తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

తొలుత ఈ వీడియోను అమెరికాలోని యుటా సెనేటర్ మైక్ లీ ట్వీట్ చేయగా.. ఎలాన్ మస్క్ దీనిని రీట్వీట్ చేశారు. మా డ్యాన్స్ ఎలా ఉందంటూ తన ఫాలోవర్లను సరదాగా ప్రశ్నించాడు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది. ఏకంగా 6.5 కోట్ల మంది ఈ వీడియోను చూడగా 3.5 వేల మంది రీట్వీట్ చేశారు. కొందరేమో వీడియో ఫన్నీగా ఉందని కామెంట్లు పెట్టగా మరికొందరు మాత్రం విమర్శలు గుప్పించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు ఈ వీడియో ఎన్నో కొన్ని ఓట్లు తెచ్చిపెడుతుందని ఓ యూజర్ అభిప్రాయపడ్డాడు. తాను ఇప్పటి వరకు చూసిన వీడియోల్లో బెస్ట్ వీడియో ఇదేనని మరో యూజర్ చెప్పాడు. ఇక మరొక యూజర్ మాత్రం కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చాక నిజమేదో.. అవాస్తవమేదో తెలుసుకోలేక పోతున్నామని వాపోయాడు.
Trump Musk
Dance Video
Viral Videos
AI video
America

More Telugu News