Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు బృందం భేటీ

World Bank represantatives met AP CM Chandrababu
 
అమరావతిలో పర్యటిస్తున్న ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం నేడు సీఎం చంద్రబాబుతో సమావేశమైంది. రాజధాని అమరావతి నిర్మాణంపై ఈ సమావేశంలో చర్చించారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించాలన్న తమ కలను చంద్రబాబు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు. ఉత్తమ ప్రమాణాలు, టెక్నాలజీతో అమరావతి నగర నిర్మాణం చేపట్టామని తెలిపారు. ప్రపంచ బ్యాంకు బృందం గత మూడ్రోజులుగా అమరావతిలో పర్యటిస్తోంది. అమరావతిలోని భవనాలు, రోడ్లను పరిశీలించింది.
Chandrababu
World Bank
Amaravati
AP Capital
Andhra Pradesh

More Telugu News