Priyanka Gandhi: జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం... మమతా బెనర్జీకి ప్రియాంకగాంధీ విజ్ఞప్తి

Priyanka Gandhi Appeal To Mamata Banerjee In Doctor Rape Murder Horror
  • ఇది హృదయవిదారకమైన ఘటనగా అభివర్ణించిన ప్రియాంకగాంధీ
  • నిందితులను కఠినంగా శిక్షించాలని మమతా బెనర్జీకి విజ్ఞప్తి
  • అప్పుడే మృతురాలి కుటుంబానికి న్యాయం జరుగుతుందని వ్యాఖ్య
కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం, హత్యపై కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ స్పందించారు. ఈ ఘటన బాధాకరమని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇది హృదయవిదారకమైన ఘటనగా అభివర్ణించారు. ఈ కేసు దర్యాఫ్తును వేగవంతం చేసి, నిందితులను కఠినంగా శిక్షించాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి విజ్ఞప్తి చేశారు.

అప్పుడే మృతురాలి కుటుంబానికి, వైద్య సిబ్బందికి న్యాయం జరుగుతుందన్నారు. మహిళలు పని చేసే ప్రదేశంలో భద్రత అనేది పెద్ద సమస్యగా మారిందని వాపోయారు. మహిళల భద్రత కోసం తీవ్రమైన కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
Priyanka Gandhi
West Bengal
Congress

More Telugu News