KTR: బహ్రెయిన్ జైల్లో సిరిసిల్ల వాసి... కేంద్రమంత్రికి కేటీఆర్ లేఖ

KTR writes letter to Union Minister
  • పాస్‌పోర్ట్ పోగొట్టుకొని బహ్రెయిన్ జైల్లో మానువాడ నర్సయ్య
  • నర్సయ్యకు అండగా ఉంటానని కేటీఆర్ హామీ
  • భారత్‌కు రప్పించేందుకు కృషి చేస్తానని వెల్లడి
బహ్రెయిన్ జైల్లో చిక్కుకుపోయిన సిరిసిల్ల జిల్లాకు చెందిన మానువాడ నర్సయ్యను స్వదేశానికి తీసుకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రమంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాశారు. జిల్లాకు చెందిన తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన 62 ఏళ్ల నర్సయ్య పాస్‌పోర్ట్ పోగొట్టుకొని బహ్రెయిన్‌లో చిక్కుకుపోయారు.

నర్సయ్యకు అండగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆయనను భారత్‌కు రప్పించేందుకు కృషి చేస్తానన్నారు. నర్సయ్యను తీసుకువచ్చేలా విదేశాంగ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చూపాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి కూడా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. బహ్రెయిన్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నారై విభాగం, బీఆర్ఎస్ ఎన్నారై విభాగం సమన్వయం చేసుకొని విడుదలకు సహకరించాలని సూచించారు.
KTR
Telangana
Jaishankar

More Telugu News