Kalva Srinivasulu: మానవ తప్పిదంతోనే తుంగభద్ర డ్యామ్ గేటు ధ్వంసం: ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు

MLA Kalva Srinivasulu hot comments on Tunga Bhadra gate damage
  • ప్రత్యామ్నాయ గేటు ఏర్పాటు చేసుకోవాలని హెచ్చరించినప్పటికీ పట్టించుకోలేదన్న ఎమ్మెల్యే
  • గేట్ల నిర్వహణ సరిగ్గా లేదని విమర్శ
  • రెండు ఏజెన్సీలతో గేటు పునరుద్ధరణ పనులు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడి
మానవ తప్పిదంతోనే తుంగభద్ర డ్యామ్ గేటు ధ్వంసమైందని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఆదివారం ఆయన ఏబీఎన్ ఛానల్‌తో మాట్లాడుతూ... ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ప్రత్యామ్నాయ గేటు ఏర్పాటు చేసుకోవాలని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరించినప్పటికీ తుంగభద్ర బోర్డు అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు.

గేట్ల నిర్వహణ సరిగ్గా లేదన్నారు. రెండు ఏజెన్సీలతో గేటు పునరుద్ధరణ పనులు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. తుంగభద్ర నుంచి 60 టీఎంసీల నీరు దిగువకు వదిలితే రాయలసీమకు తీరని నష్టం జరుగుతుందన్నారు.
Kalva Srinivasulu
TungaBhadra Dam
Andhra Pradesh

More Telugu News