టెక్కలిలో దువ్వాడ ఇంట్లోనే ఉంటా: దివ్వెల మాధురి
- దువ్వాడ తనకు అగ్రిమెంట్ రాసిచ్చాడంటూ వ్యాఖ్యలు
- ఆయన అక్కడే ఉన్నా లేకున్నా తాను పిల్లలతో నివాసం ఉంటానని వెల్లడి
- అడ్డుకోవాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటానని మాధురి బెదిరింపు
తనను అడ్డుకోవాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. తన పిల్లల జోలికి వస్తే చెప్పుతో కొడతానంటూ దువ్వాడ వాణిపై మాధురి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు తాను టెక్కలికి వెళుతున్నట్లు మాధురి చెప్పారు. కాగా, ఈ విషయంపై దువ్వాడ శ్రీనివాస్ కూతురు హైంధవి మాట్లాడుతూ.. టెక్కలిలోని ఇల్లు తమ తల్లి డబ్బులతో నిర్మించిందని, ఈ ఇంటిపై తమకు హక్కు ఉందని చెప్పారు. తాము ఇంటి ముందు నుంచి వెళ్లేది లేదని తేల్చిచెప్పారు. ఈ ఇంట్లో దువ్వాడ శ్రీనివాస్ కు ఉండే హక్కు ఉంది అయితే తాము ఇంట్లో ఉండకూడదనే హక్కు మాత్రం ఆయనకు లేదన్నారు.