చరిత్ర సృష్టించిన కీరన్ పొలార్డ్.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో విధ్వంసం
- ‘ది హండ్రెడ్’ లీగ్‌లో వెస్టిండీస్ మాజీ ఆటగాడి విధ్వంసం
- క్లిష్ఠ పరిస్థితుల్లో ఉన్న జట్టుని గెలిపించిన పొలార్డ్
- ఖంగుతున్న రషీద్ ఖాన్
తన ఇన్నింగ్స్ ప్రారంభంలో 14 బంతుల్లో కేవలం 6 పరుగులు మాత్రమే రాబట్టి ఇబ్బంది పడ్డట్టుగా పొలార్డ్ కనిపించాడు. ఆ సమయంలో సదరన్ బ్రేవ్ జట్టు గెలుపునకు 20 బంతుల్లో 49 పరుగులు అవసరమయ్యాయి. మ్యాచ్ జారిపోతున్నట్లుగా అనిపించింది. ఆ సమయంలో రషీద్ ఖాన్ తన చివరి ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. రషీద్‌పై పొలార్డ్ విరుచుకుపడ్డారు. వరుసగా ఆరు బంతులనూ సిక్సర్లు బాదాడు. దీంతో గెలుపు సమీకరణం 15 బంతుల్లో 19 పరుగులుగా మారిపోయింది. పొలార్డ్ 23 బంతుల్లో 45 పరుగులు బాది ఔటయ్యాడు. ఆ తర్వాత క్రిస్ జోర్డాన్ మిగతా పనిని పూర్తి చేయడంతో సదరన్ బ్రేవ్ జట్టు సునాయాసంగా గెలిచింది.