August 15th: ఏపీలో స్వాతంత్ర్య వేడుకలు.. ఎవరు ఎక్కడ జెండాను ఎగురవేస్తారంటే..!

August 15th Celebration Chandrababu Will Hoist Flag In Vijayawada
  • విజయవాడలో చంద్రబాబు.. కాకినాడలో పవన్ 
  • జిల్లా కేంద్రాల్లో మంత్రుల చేతుల మీదుగా జెండా ఆవిష్కరణలు
  • ఉత్తర్వులు జారీ‌చేసిన ప్రొటోకాల్ విభాగం
స్వాతంత్ర్య వేడుకల నిర్వహణకు సంబంధించి ఏపీ సాధారణ పరిపాలనశాఖ ప్రొటోకాల్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ప్రకారం.. రాష్ట్రస్థాయిలో నిర్వహించే వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఆగస్టు 15న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. జిల్లా స్థాయిలో మంత్రులు పతాకావిష్కరణ చేస్తారు. కాకినాడలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జాతీయ త్రివర్ణ పతకాన్ని ఎగురవేస్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలెక్టర్ దినేశ్‌కుమార్ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.

జిల్లాలో పాల్గొనే మంత్రులు వీరే..
గుంటూరులో మంత్రి నారా లోకేశ్, శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు, మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర, నరసరావుపేటలో నాదెండ్ల మనోహర్, నెల్లూరులో పొంగూరు నారాయణ పాల్గొంటారు. అనకాపల్లిలో వంగలపూడి అనిత, చిత్తూరులో సత్యకుమార్ యాదవ్, పశ్చిమ గోదావరి జిల్లాలో నిమ్మల రామానాయుడు, కడప జిల్లాలో ఫరూక్, తిరుపతి జిల్లాలో అనం రామనారాయణరెడ్డి, అనంతపురంలో పయ్యావుల కేశవ్, విశాఖలో అనగాని సత్యప్రసాద్ వేడుకల్లో పాల్గొంటారు.

ఏలూరులో కొలుసు పార్ధసారధి, ప్రకాశం జిల్లా ఒంగోలులో డోలా బాలవీరాంజనేయస్వామి, బాపట్ల జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, తూర్పు గోదావరి జిల్లాలో కందుల దుర్గేష్, పార్వతీపురం మన్యం జిల్లాలో సంధ్యారాణి, నంద్యాల జిల్లాలో బీసీ జనార్దన్‌రెడ్డి, కర్నూలు జిల్లాలో టీజీ భరత్. సత్యసాయి జిల్లాలో సవిత, అమలాపురంలో వాసంశెట్టి సుభాష్, విజయనగరంలో కొండపల్లి శ్రీనివాస్, అన్నమయ్య జిల్లాలో రామ్ ప్రసాద్ రెడ్డి జాతీయ జెండాలను ఎగురవేస్తారు.
August 15th
Independence Day
Celebrations
Chandrababu
Pawan Kalyan

More Telugu News