వినేశ్ ఫొగాట్ రిటైర్మెంట్ ప్రకటనపై స్పందించిన రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు
- సోషల్ మీడియా ద్వారా ఫొగాట్ నిర్ణయం తెలిసిందన్న సంజయ్ సింగ్
- రిటైర్మెంట్ ప్రకటన తమను షాక్కు గురి చేసిందని వెల్లడి
- ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి నిర్ణయం వద్దని సూచన
ఈ విషయమై వినేశ్ ఫోగాట్ తో మాట్లాడుతామన్నారు. ఒలింపిక్స్లో ఫొగాట్ అధిక బరువు ఉండటంపై సంజయ్ సింగ్ ఆమె సహాయక సిబ్బందిపై మండిపడ్డారు. ఇందులో వినేశ్ ఫొగాట్ పొరపాటు ఏమీ లేదన్నారు. ఆమెకు ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఫిజియో, పోషకాహార నిపుణుడితో సహా కోచ్, ఇతర సహాయక సిబ్బంది చూసుకోవాల్సిందన్నారు. ఈ అంశంపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.