Bitthiri Sathi: భగవద్గీతపై వీడియో.. సారీ చెప్పిన బిత్తిరి సత్తి!

Bitthiri Sathi Say Sorry in Controversy of Bhagvad Gita Video
భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశాడన్న ఘటనపై ర‌వికుమార్ కావ‌లి అలియాస్ బిత్తిరి సత్తి తాజాగా సారీ చెప్పారు. "నేను సరదాగా చేసిన వీడియో అది. కానీ, కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎవరినీ కించపరచాలని కాదు. చిన్న అక్ష‌ర‌దోషం వ‌ల‌న అలా జ‌రిగింది. ఎవరైనా బాధపడితే క్షమాపణలు చెబుతున్నా" అంటూ చెప్పుకొచ్చారు. ఈ మేర‌కు ప్ర‌త్యేకంగా ఓ వీడియో విడుద‌ల చేశారు బిత్తిరి సత్తి. తాను కూడా భ‌గ‌వ‌ద్గీతను ఆరాధిస్తాన‌ని, చ‌దువుతాన‌ని తెలిపారు.

కాగా, భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశాడంటూ రాష్ట్రీయ వాన‌ర‌సేన బుధ‌వారం హైద‌రాబాద్ సీసీఎస్‌లో బిత్తిరి సత్తిపై ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం.
Bitthiri Sathi
Bhagvad Gita
Sorry

More Telugu News