TS Police: ఐదుగురు సీనియర్ పోలీసు అధికారులకు పదోన్నతులు.. ప్రభుత్వం ఉత్తర్వులు

Key developments in the Telangana Police Department Promotions for those officers
  • డీజీపీలుగా శివధర్ రెడ్డి, సౌమ్య మిశ్రా, షికా గోయల్, అభిలాష బిస్తి
  • డీజీ క్యాడర్ లో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతి కుమారి
తెలంగాణ పోలీస్ శాఖలో సీనియర్ అధికారులు పదోన్నతులు పొందారు. ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీపీ, డీజీ హోదా లభించింది. అదనపు డీజీలుగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులు శివధర్ రెడ్డి, సౌమ్య మిశ్రా, షికా గోయల్, అభిలాష బిస్తి లకు డీజీపీలుగా, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వం డీజీగా పదోన్నతి కల్పించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈరోజు (గురువారం) ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డితో పాటు సీఐడీ చీఫ్ షికా గోయల్, జైళ్ల శాఖ చీఫ్ సౌమ్య మిశ్రా, తెలంగాణ పోలీస్ అకాడమి డైరెక్టర్ అభిలాష బిస్తి అవే స్థానాల్లో కొనసాగుతారని ఆదేశాల్లో సీఎస్ పేర్కొన్నారు.
TS Police
Telangana

More Telugu News