హర్యానా సర్కార్ కీలక నిర్ణయం.. వినేశ్‌కు రజత పతక విజేతకు దక్కే అన్ని రివార్డులు, సౌకర్యాలు!
- వినేశ్ ఇప్పటికీ ఛాంపియనేనని కొనియాడిన సీఎం నయాబ్ సైనీ
- ఒలింపిక్ మెడలిస్ట్ మాదిరిగానే ఆమెకు స్వాగతం పలుకుతామన్న సీఎం
- అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్ వరకు వెళ్లిందంటూ ప్రశంస
ఈ క్రమంలో వినేశ్ స్వరాష్ట్రం హర్యానా ఆమెకు మద్ధతుగా నిలిచింది. తాజాగా అక్కడి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వినేశ్‌కు రజత పతక విజేతకు దక్కే అన్ని సన్మానాలు, రివార్డులు, సౌకర్యాలు అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నయాబ్ సైనీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు. వినేశ్ ఛాంపియనేనని ఈ సందర్భంగా ఆమెను హర్యానా ముఖ్యమంత్రి కొనియాడారు.
"అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్ వరకు వెళ్లింది. ఏ కారణంతోనైనా ఆమె ఫైనల్ ఆడకపోవచ్చు. కానీ మాకు ఆమె ఛాంపియనే. ఈ నేపథ్యంలోనే మా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్ మెడలిస్ట్ మాదిరిగానే ఆమెకు స్వాగతం పలకాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ఒలింపిక్ రజత పతక విజేతకు దక్కే అన్ని సన్మానాలు, రివార్డులు, సౌకర్యాలను వినేశ్‌కు అందిస్తామని" అని తెలిపారు.