ఫిజీ దేశపు అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Of India Droupadi Murmu receives Fiji highest civilian award
  • పసిఫిక్ దేశాల్లో పర్యటిస్తున్న భారత రాష్ట్రపతి
  • ఫిజీ పర్యటనలో ముర్ముకు విశిష్ట గౌరవం
  • 'కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ' ప్రదానం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పసిఫిక్ దేశాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా, ఫిజీ దేశంలో పర్యటిస్తున్న ద్రౌపది ముర్ముకు ఆ దేశ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం 'కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజి' ప్రదానం చేసింది. 

ఫిజీ అధ్యక్షుడు రటు విలియమే మైవాలిలి కటోనివెరే ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పురస్కారంతో భారత రాష్ట్రపతిని గౌరవించారు. దీనిపట్ల ద్రౌపది ముర్ము ఫిజీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఇరుదేశాల మధ్య ఉన్న సంబంధాలను ముర్ము ఈ సందర్భంగా ప్రస్తుతించారు. ఫిజీని దృఢమైన, స్థితిస్థాపక, సుసంపన్న దేశంగా మలిచే దిశగా భారత్ భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు సంసిద్ధంగా ఉందని ముర్ము స్పష్టం చేశారు.
Go Back to Shorts
Droupadi Murmu
President Of India
Fiji
Award
India

More Telugu News