CJI Chandrachud: ఒత్తిడి ఎలా ఉంటుంటో నా స్థానంలో ఒకరోజు కూర్చుంటే తెలుస్తుంది: సీజేఐ చంద్రచూడ్

CJI DY Chandrachud comments in Supreme Court advocates
 
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పలువురు సుప్రీంకోర్టు  న్యాయవాదులపై అసహనం వ్యక్తం చేశారు. ముంబయి చెంబూర్ కాలేజీలో బురఖా రద్దు వ్యవహారంపై ఆయన స్పందించారు. 

కోర్టులపైనా, జడ్జిలపైనా ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు. న్యాయవాదులు ఒకరోజు సీజేఐ స్థానంలో కూర్చుంటే ఒత్తిడి అంటే ఎలా ఉంటుందో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. మళ్లీ జీవితంలో ఆ స్థానంలోకి రాకుండా పారిపోతారని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. 

"ప్రతి ఒక్కరూ తమ కేసును ముందుగా విచారణ చేయమని కోరుతున్నారు కానీ, జడ్జిలపై ఎంత ఒత్తిడి ఉంటుందో ఎవరూ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ప్రతి ఒక్క పిటిషన్ పై విచారణకు ఒక తేదీ ఇస్తాం. జడ్జిలను, కోర్టులను శాసించవద్దు" అని స్పష్టం చేశారు.
CJI Chandrachud
Advocates
Supreme Court
India

More Telugu News