Andhra Pradesh: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్

Good news for ration card holders in Andhrapradesh
  • వచ్చే నెల నుండి బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ
  • కందిపప్పు, పంచదార పంపిణీకి చర్యలు
  • రేషన్ పంపిణీలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
ఏపీ లో రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే నెల నుండి రేషన్ కార్డు దారులకు తక్కువ ధరకే కందిపప్పు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. శనివారం గుంటూరు జిల్లా పరిషత్ సమావేశంలో మంత్రి నాదెండ్ల పాల్గొన్నారు. అభివృద్ధి పనుల గురించి అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ .. రేషన్ పంపిణీలో వైసీపీ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు.

పేదలకు అందాల్సిన రేషన్ బియ్యంను వైసీపీ పెద్దలు దారి మళ్లించి కోట్లాది రూపాయల అక్రమాలు చేశారని విమర్శించారు. పేదలకు అందాల్సిన రేషన్ లో అవినీతి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వచ్చే నెల నుండి బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులను రేషన్ కార్డులకు పంపిణీ చేస్తామని చెప్పారు. బియ్యం డోర్ డెలివరీ పేరుతో చేపట్టిన విధానం లోపభూయిష్టంగా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గత ప్రభుత్వ చర్యల వల్ల పౌర సరఫరాల శాఖకు భారీగా నష్టం జరిగిందని ఆయన విమర్సించారు. డోర్ డెలివరీ పేరుతో ఎండీయూ వాహనాలు ఏర్పాటు చేసినా ఎక్కడా డోర్ డెలివరీ జరగడం లేదని మంత్రి నాదెండ్ల అన్నారు.

శాంతి భద్రతల విషయంలో ఏ పార్టీ అయినా చర్యలు ఒకేలా ఉంటాయని మంత్రి నాదెండ్ల అన్నారు. కూటమికి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరూ ఉచిత ఇసుక విధానంలో జోక్యం చేసుకోవద్దని ఆయన హితవు పలికారు.
Andhra Pradesh
ration cards
Good news

More Telugu News