అమరావతి రైతులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం

AP Govt conveys good news to Amaravati farmers
  • నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం
  • అమరావతి రైతులకు మరో ఐదేళ్లు కౌలు చెల్లించాలని నిర్ణయం
  • నాడు అమరావతి కోసం 30 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు
  • పదేళ్ల పాటు వారికి కౌలు చెల్లించాలని నాటి ప్రభుత్వం నిర్ణయం
  • పదేళ్ల గడువు ముగియడంతో, మరో ఐదేళ్లకు పొడిగించాలని నేటి సమావేశంలో నిర్ణయం
ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ రాజధాని అమరావతి రైతులకు శుభవార్త చెప్పారు. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు మరో ఐదేళ్ల పాటు కౌలు చెల్లించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. 

ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి నారాయణ కూడా హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాకు వివరాలు తెలిపారు. 

2014లో రాష్ట్ర విభజన అనంతరం ఏపీ ప్రభుత్వం అమరాతి రైతుల నుంచి రాజధాని కోసం 30 ఎకరాల భూమిని సేకరించింది. పదేళ్ల పాటు రైతులకు వార్షిక కౌలు చెల్లించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడా పదేళ్ల గడువు పూర్తి కావడంతో, నేడు సీఎం చంద్రబాబు సీఆర్డీఏ సమావేశంలో కౌలు అంశంపై చర్చించారు. 

అమరావతి రైతులకు వార్షిక కౌలును మరో ఐదేళ్లకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు. రైతు కూలీలకు మరో ఐదేళ్ల పాటు పింఛను చెల్లించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
Go Back to Shorts
Amaravati
Farmers
Lease
AP Capital
Chandrababu
CRDA
TDP-JanaSena-BJP Alliance

More Telugu News