వైసీపీ తాడేపల్లి కార్యాలయంలో జగన్.. కార్యకర్తలకు అధినేత భరోసా
కాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ అధినేత జగన్ ఆరోపిస్తున్నారు. హత్యలకు కూడా పాల్పడుతున్నారని అంటున్నారు. ఈ విషయాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఇటీవలే దేశరాజధాని న్యూఢిల్లీలో నిరసన కూడా చేపట్టారు. జగన్ ఆందోళనకు ఇండియా కూటమి పార్టీలు కొన్ని మద్దతు పలికాయి. అయితే రాష్ట్రంలో జగన్ చెబుతున్న పరిస్థితులు లేవని, వ్యక్తిగతంగా జరుగుతున్న దాడులను సైతం ప్రభుత్వానికి అంటగడుతున్నారంటూ కూటమి నేతలు ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కార్యకర్తల బాధలు వినేందుకు తాడేపల్లి కార్యాలయంలో జగన్ అందుబాటులోకి వచ్చారు.