Harassment: మచిలీపట్నంలో ఆకతాయికి దేహశుద్ధి చేసిన విద్యార్థిని, కుటుంబ సభ్యులు... వీడియో ఇదిగో!

Girl and her family members beaten a thug in Machilipatnam
మచిలీపట్నంలో విద్యార్థినిని వేధిస్తున్న ఆకతాయికి దేహశుద్ధి జరిగింది. ముగ్గురు కుర్రాళ్లు తనను వేధిస్తున్న విషయాన్ని విద్యార్థిని తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దాంతో గత మూడ్రోజులుగా ఆమె కుటుంబ సభ్యులు ఆకతాయిల కోసం వెదుకుతున్నారు. 

ముగ్గురిలో ఒకడు నిన్న కనిపించడంతో... విద్యార్థిని, ఆమె కుటుంబ సభ్యులు అతడికి దేహశుద్ధి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాగా దెబ్బలు తిన్న తర్వాత ఆ పోకిరీ... "సారీ అక్కా" అని చెప్పడం వీడియోలో కనిపించింది. అయితే ఆ విద్యార్థిని, ఆమె కుటుంబ సభ్యులు... "నడువు పోలీస్ స్టేషన్ కి" అంటూ అతడిని పోలీసులకు అప్పగించారు.
Harassment
Girl
Thugs
Machilipatnam

More Telugu News