లంకతో రెండో టీ20... టాస్ గెలిచిన టీమిండియా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లంకతో రెండో టీ20... టాస్ గెలిచిన టీమిండియా

Team India won the toss in 2nd T20 against Sri Lanka
  • టీమిండియా-శ్రీలంక మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్
  • నేడు రెండో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా నేడు టీమిండియా, శ్రీలంక జట్టు రెండో మ్యాచ్ ఆడుతున్నాయి. పల్లెకెలెలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. నిన్న జరిగిన తొలి మ్యాచ్ లో విజయభేరి మోగించిన భారత జట్టు... నేటి మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని దృఢసంకల్పంతో ఉంది. 

ఓపెనర్ శుభ్ మాన్ గిల్ మెడనొప్పితో బాధపడుతుండడంతో, అతడిని ఈ మ్యాచ్ కు ఎంపిక చేయలేదు. గిల్ స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజూ శాంసన్ కు తుదిజట్టులో చోటు కల్పించారు. అటు, లంక జట్టులోనూ ఒక మార్పు జరిగింది. దిల్షాన్ మధుశంక స్థానంలో రమేశ్ మెండిస్ జట్టులోకి వచ్చాడు.
Advertisement
Team India
Sri Lanka
Toss
2nd T20
Pallekele

More Telugu News