ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశమైన సీఎం చంద్రబాబు
పోలవరం పూర్తి చేస్తామని ఇటీవల బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి సహాయసహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. పోలవరం మొదటి దశను మూడేళ్లలో పూర్తి చేస్తామని కేంద్ర జలశక్తి శాఖ ఇటీవలే పార్లమెంటులో ప్రకటన చేసింది.
పోలవరం మొదటి దశ నిర్మాణానికి రూ.12 వేల కోట్లు, మొత్తం రూ.50 వేల కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది.