Nadu Nedu: ‘నాడు నేడు’ కార్యక్రమంపై విచారణ చేయిస్తాం: లోకేశ్

Minister Nara Lokesh Says Enquiry On Nadu Nedu Program
వైసీపీ హయాంలో చేపట్టిన ‘నాడు నేడు’ కార్యక్రమం పనుల్లో భారీగా అవినీతి జరిగినట్టు అనుమానిస్తున్న ఏపీలోని కూటమి ప్రభుత్వం దానిపై విచారణ చేయాలని నిర్ణయించింది. నేటి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ స్కూళ్ల అభివృద్ధి కోసం జగన్ ప్రభుత్వం చేపట్టిన ‘నాడు నేడు’ కార్యక్రమంలో భారీగా అవినీతి జరిగిందని, స్కూళ్ల అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని, దీనిపై విచారణ చేపడతామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యావిధానంలో కొత్త విధానం తీసుకొస్తామని, కేజీ నుంచి పీజీ వరకు కాలేజీలను మ్యాపింగ్ చేస్తామని తెలిపారు.
Nadu Nedu
Andhra Pradesh
Nara Lokesh
YS Jagan

More Telugu News