BRS: రేపు బీఆర్ఎస్ శాసన సభా పక్ష సమావేశం

BRS LP meeting tomorrow
  • తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ
  • జాబ్ క్యాలెండర్, నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించనున్న బీఆర్ఎస్
  • రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ వైఫల్యంపై ప్రశ్నించనున్న బీఆర్ఎస్
బీఆర్ఎస్ శాసన సభా పక్ష సమావేశం మంగళవారం మధ్యాహ్నం జరగనుంది. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ కానున్నారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించనున్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ వైఫల్యంపై సమావేశాల సందర్భంగా ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రశ్నించనుంది. అదేవిధంగా చేనేత కార్మికుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో చర్చించనుంది. ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్సుమెంట్స్, పారిశుద్ధ్యంపై అసెంబ్లీలో బీఆర్ఎస్ చర్చించనుంది.
BRS
Telangana
Telangana Assembly Session

More Telugu News