పసుపు లాల్చీ ధరించి, పసుపు రంగు సైకిల్ పై పార్లమెంటుకు చేరుకున్న టీడీపీ ఎంపీ అప్పలనాయుడు
లోక్ సభకు మొదటిసారి ఎన్నికైన టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సైకిల్ పై పార్లమెంటుకు చేరుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. పసుపు లాల్చీ ధరించిన అప్పలనాయుడు, పసుపు రంగేసిన సైకిల్ తొక్కుకుంటూ పార్లమెంటుకు విచ్చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయనే స్వయంగా పంచుకున్నారు.
కలిశెట్టి అప్పలనాయుడు లోక్ సభ ఎన్నికల్లో విజయనగరం స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా సైకిల్ పై పార్లమెంటుకు వచ్చి అందరి దృష్టిలో పడ్డారు.