నీట్ ఎగ్జాంపై సుప్రీంలో విచారణ.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
- పేపర్ లీక్ దేశమంతటా విస్తరించిందనడానికి ఆధారాలు లేవన్న చీఫ్ జస్టిస్
- పరీక్ష రద్దు చేయాలంటూ విద్యార్థులు, పేరెంట్స్ పిటిషన్
- విచారణ జరుపుతున్న సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం
లీకేజీకి సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించాలని గత విచారణలో ఆదేశించారు. ఇప్పటి వరకు సమర్పించిన ఆధారాలను పరిశీలించగా.. లీక్ అయిన పేపర్ విస్తృతంగా షేర్ అయిందనేందుకు ఆధారాలు లేవని వివరించారు. బీహార్ లోని హజారీబాఘ్, పాట్నాలలో పేపర్ లీక్ జరిగిందనే విషయాన్ని సీజేఐ అంగీకరిస్తూనే.. అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు పేపర్ వెళ్లిందనేందుకు ఎవిడెన్స్ ఉంటే చెప్పాలని అడిగారు.
ఉదయం 9 గంటలకు పేపర్ లీక్ అయిందని, 10:30 గంటలకల్లా అది ముగిసిందని కోర్టు విశ్వసిస్తోందని సీజేఐ తెలిపారు. కోర్టు నమ్మకాన్ని తప్పని నిరూపించే ఆధారాలు ఉంటే వెల్లడించాలని పిటిషన్ దారులకు సూచించారు. సీబీఐ అందించిన నివేదిక ప్రకారం నీట్ యూజీ ప్రశ్నాపత్రం ఎక్కడ ముద్రించారనే విషయం తమకు తెలిసిందని, అయితే, ఆ విషయాన్ని బహిరంగపరిచే ఉద్దేశం తమకులేదని అన్నారు.