ప్రభుత్వ ఉద్యోగులు ఆరెస్సెస్‌లో చేరడంపై దశాబ్దాలుగా ఉన్న నిషేధం ఎత్తివేత.. భలే టైమింగ్ అంటూ కాంగ్రెస్ విసుర్లు
- గాంధీ హత్య తర్వాత 1948లో ఆరెస్సెస్‌పై నిషేధం
- ఆ తర్వాత ఎత్తివేత.. తిరిగి 1966లో మరోమారు నిషేధం
- తాజాగా నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
- బ్రూరోక్రసీ ఇప్పుడు నిక్కర్లలోనూ రావొచ్చంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శలు
మహాత్మాగాంధీ హత్య తర్వాత ఫిబ్రవరి 1948లో సర్దార్ పటేల్ ఈ నిషేధం విధించారని, అయితే, ఆ తర్వాత మంచిగా మెలుగుతామన్న ఆరెస్సెస్ హామీతో దానిని ఎత్తివేశారని తెలిపారు. ఆ తర్వాత కూడా ఆరెస్సెస్ ఎప్పుడూ నాగ్‌పూర్‌లో మువ్వన్నెల జెండా ఎగురవేయలేదని విమర్శించారు. అయితే, ఆ తర్వాత 1966లో ఆరెస్సెస్, జమాత్-ఇ-ఇస్లామీలో ప్రభుత్వ ఉద్యోగులు చేరడాన్ని ప్రభుత్వం నిషేధించిందని తెలిపారు.
తాజాగా, నిషేధాన్ని ఎత్తివేడయంపై రమేశ్ తీవ్రంగా స్పందించారు. నిషేధం ఎత్తివేత సమయాన్ని ఎత్తి చూపారు. 4 జూన్ 2024 తర్వాత స్వీయ అవిభక్త నాన్ బయోలాజికల్ పీఎం, ఆరెస్సెస్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని, ఇప్పుడు నిషేధం ఎత్తివేత ద్వారా వాటిని తిరిగి పునరుద్ధరించుకోవాలన్న భావన కనిపిస్తోందన్న ఉద్దేశాన్ని ఆయన వ్యక్తపరిచారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనూ కొనసాగిన నిషేధాన్ని ఇప్పుడు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బ్యూరోక్రసీ నిక్కర్లలోనూ రావొచ్చు’ అని రమేశ్ విమర్శించారు. కాగా, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ స్వాగతించారు.