ఏపీ గవర్నర్ ను కలిసిన జగన్
- విజయవాడలో రాజ్ భవన్ కు విచ్చేసిన జగన్
- గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ
- రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆందోళన
- చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి
ఇటీవల వినుకొండలో జరిగిన రషీద్ అనే యువకుడి హత్య ఘటన, పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ల దాడి, ఇతర సంఘటలను జగన్ గవర్నర్ కు వివరించారు. అంతేకాదు, ఆయా ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా గవర్నర్ కు అందించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న లా అండ్ ఆర్డర్ ను పునరుద్ధరించేందుకు గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు.