Manorama Khedkar: పూణే పోలీసుల అదుపులో వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ తల్లి

Pune Police Arrested Controversial probationary IAS officer Puja Khedkar Mother
  • తుపాకితో రైతులను బెదిరించిన మనోరమ వీడియో వైరల్ 
  • వెలుగులోకి రావడంతో పరారీలో పూజ ఖేద్కర్ తల్లి
  • రాయ్‌గఢ్‌లోని ఓ హోటల్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు
  • మూడు బృందాలతో కలిసి పూణె తీసుకొస్తున్న అధికారులు
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్‌ను పూణే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుపాకితో ఆమె రైతులను బెదిరిస్తున్న వీడియో ఒకటి ఇటీవల బాగా వైరల్ అయింది. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసి ఆమె కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో రాయ్‌గడ్‌లోని ఓ హోటల్‌లో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. మనోరమను అదుపులోకి తీసుకున్న మూడు పోలీసు బృందాలు ఆమెను పూణేకు తరలిస్తున్నాయి. 

పూజపై పలు వివాదాలు తెరపైకి రావడంతో ప్రభుత్వం ఇటీవల ఆమెపై చర్యలు తీసుకుంది. ఆమె శిక్షణను ఆపేసిన ప్రభుత్వం ఈ నెల 23వ తేదీలోగా ముస్సోరిలోని లాల్‌బహదూర్‌శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. దీంతో ఆమెను విధుల నుంచి రిలీవ్ చేశారు. మరోవైపు, పూణే కలెక్టర్ సుహాస్ దివాసే తనను వేధిస్తున్నారంటూ పోలీసులకు పూజ ఫిర్యాదు చేశారు.
Manorama Khedkar
Puja Khedkar
Maharashtra
Pune Police

More Telugu News