Suryapet District: క్వారీ గుంతలో పడి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సహా ముగ్గురి మృతి

Three dead people dead in Surypaet district
  • సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం బొప్పారంలో విషాదం
  • ఉదయం క్వారీని చూసేందుకు వెళ్లిన శ్రీపాల్ రెడ్డి, రాజు, ఆయన కూతురు
  • క్వారీలో పడిపోయిన కూతురు
  • ఆమెను కాపాడే క్రమంలో అందరూ మృతి
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. క్వారీ గుంతలో పడి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సహా ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన ఆత్మకూరు (ఎస్) మండలం బొప్పారంలో చోటు చేసుకుంది. శ్రీపాల్ రెడ్డి, రాజు స్నేహితులు. వీరు హైదరాబాద్‌లో ఉంటున్నారు. శ్రీపాల్ రెడ్డి బిల్డర్ కాగా, రాజు సాఫ్ట్ వేర్ ఇంజినీర్. మంగళవారం వీరు ఓ విందులో పాల్గొన్నారు.

బుధవారం ఉదయం శ్రీపాల్ రెడ్డి, రాజు, ఆయన కూతురు క్వారీని చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో రాజు కూతురు క్వారీలో పడిపోయింది. గుంతలో నీరు ఉండటంతో ఆమెను కాపాడేందుకు శ్రీపాల్ రెడ్డి, రాజు అందులోకి దిగారు. ఈత రాకపోవడంతో ముగ్గురూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
Suryapet District
Nalgonda District

More Telugu News