Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ చొరవతో కువైట్ నుంచి ఏపీకి చేరుకున్న శివ

Siva returns AP from Kuwait with the help of Nara Lokesh
  • ఉపాధి కోసం ఏపీ నుంచి కువైట్ వెళ్లిన శివ
  • పడరాని కష్టాలు పడుతున్నానంటూ వీడియో
  • ఆదుకోకపోతే చావే దిక్కు అంటూ కన్నీటితో వేడుకున్న వైనం
  • వెంటనే స్పందించిన ఏపీ మంత్రి నారా లోకేశ్
ఏపీ నుంచి కువైట్ వెళ్లి, అక్కడ అష్టకష్టాలు పడుతూ, తనను ఎవరైనా ఆదుకోకపోతే చావే దిక్కు అంటూ శివ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వైరల్ కావడం తెలిసిందే. దీనిపై స్పందించిన ఏపీ మంత్రి నారా లోకేశ్ శివను కువైట్ నుంచి ఏపీకి రప్పించేందుకు ఎంతో కృషి చేశారు. భారత ఎంబసీతో సమన్వయం చేసుకుంటూ, అతడిని ఏపీకి తీసుకువచ్చేంతవరకు స్వయంగా పర్యవేక్షించారు. 

మంత్రి లోకేశ్ చొరవతో శివ కువైట్ నుంచి ఏపీకి తిరిగి వచ్చాడు. ఎయిర్ పోర్టులో శివను చూసి అతడి కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగాలతో కన్నీటిపర్యంతమయ్యారు. కాగా, శివ తన స్వస్థలం మదనపల్లె చేరుకున్న విషయం తెలుసుకున్న నారా లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు.
Nara Lokesh
SIva
Kuwait
Madanapalle
Andhra Pradesh

More Telugu News