నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు... అమిత్ షాతో భేటీ
- 15 రోజుల వ్యవధిలో రెండోసారి ఢిల్లీకి చంద్రబాబు
- సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్న ఏపీ సీఎం
- అమిత్ షాతో భేటీలో విభజన సమస్యలపై చర్చించే అవకాశం
ఈరోజు ఉదయం 11 గంటలకు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ఆయన ఢిల్లీకి బయలుదేరుతారు. ఈరోజు రాత్రి దేశ రాజధానిలోనే బస చేయనున్నారు. అమిత్ షాతో భేటీ సందర్భంగా విభజన సమస్యలు పరిష్కరించాలని ఏపీ సీఎం కోరే అవకాశముంది. ఇతర రాజకీయ అంశాల పైనా చర్చించనున్నారని తెలుస్తోంది.