TG Secretariat: తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి నిరుద్యోగుల యత్నం.. తీవ్ర ఉద్రిక్తత

Tension near TG Secretariat
  • డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలంటూ సెక్రటేరియట్ ముట్టడికి యత్నం
  • ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారుల నినాదాలు
డీఎస్సీ పరీక్ష నిర్వహణను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జనసభ, నిరుద్యోగులు తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సచివాలయం వైపు వెళ్తున్న ఆందోళనకారులను అడ్డుకోవడానికి పోలీసులు యత్నించడంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్లకు తరలించారు. బీసీ జనసభ నేత రాజారాం యాదవ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నిరసనకారులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎస్సీ పరీక్షను వాయిదా వేయకపోతే సీఎం రేవంత్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉద్యోగాలు ఇవ్వమంటే పోలీసులతో రాజ్యం నడుపుతున్నారని సీఎంపై విమర్శలు గుప్పించారు.
TG Secretariat
Revanth Reddy
Congress

More Telugu News