Sarath Kumar: విష్ణు మంచు ‘కన్నప్ప’లో నాథనాధుడుగా శరత్ కుమార్ ఉగ్రరూపం

Sarath Kumar first look from Kannappa released
షార్ట్స్‌లో చూడండి
డైనమిక్ హీరో విష్ణు మంచు ‘కన్నప్ప’ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్‌గా విడుదల చేసిన టీజర్‌తో కన్నప్ప మీద మరింత బజ్ నెలకొంది. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ గురించి సోషల్ మీడియాలో చర్చ ఊపందుకుంది. కన్నప్ప ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యే కన్నప్ప వాడిన విల్లు, ఇతర విశేషాలు నెట్టింట్లో ట్రెండ్ అయ్యాయి.

తాజాగా కన్నప్ప చిత్రం నుంచి శరత్ కుమార్ పాత్రకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. శరత్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా నేడు ఆయన క్యారెక్టర్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఆయన నాథనాధుడిగా కనిపించబోతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఆయన ఉగ్రరూపాన్ని చూడొచ్చు. ఓ యోధుడిలా శరత్ కుమార్ కనిపిస్తున్నారు.

అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఈ చిత్రాన్ని పద్మశ్రీ డా.మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సీ సంగీతాన్ని అందిస్తున్నారు. విజువల్ ట్రీట్ ఇచ్చేలా, ఇండియన్ స్క్రీన్ మీద మునుపెన్నడూ చూడనటువంటి గ్రాండియర్‌ స్టయిల్ లో కన్నప్ప చిత్రం రానుంది. 

మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారగణంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Go Back to Shorts
Sarath Kumar
Kannappa
First Look
Manchu Vishnu
Tollywood

More Telugu News