Nara Lokesh: తాడేపల్లి గంగానమ్మ ఆలయ పునర్ నిర్మాణ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి

Nara Lokesh and Brahmani visits Ganganamma Temple in Tadepalli
మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలోని గంగానమ్మ ఆలయ పునర్ నిర్మాణ ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి పాల్గొన్నారు. గంగానమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిపై లోకేశ్ సోషల్ మీడియాలో స్పందించారు. 

సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రంలోని ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడాలని గంగానమ్మ తల్లిని వేడుకున్నామని తెలిపారు. ఆలయ పునర్ నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సీనియర్ నేత దొంతిరెడ్డి సాంబిరెడ్డి, కమిటీ సభ్యులను అభినందించినట్టు వెల్లడించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చానని లోకేశ్ వివరించారు. ఈ మేరకు ఫొటోలను కూడా పంచుకున్నారు.
Nara Lokesh
Ganganamma Temple
Tadepalli
Mangalagiri
TDP
Andhra Pradesh

More Telugu News