Visakha Files: కశ్మీర్ ఫైల్స్ తరహాలో విశాఖ ఫైల్స్ విడుదల చేస్తాం: గంటా శ్రీనివాసరావు

Ganta says soon they will release Visakha files
  • విశాఖలో భారీ ఎత్తున భూ అక్రమాలు జరిగాయన్న భీమిలి ఎమ్మెల్యే గంటా
  • ఇందులో చాలామంది ఉన్నారని వెల్లడి
  • ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని స్పష్టీకరణ
కశ్మీర్ ఫైల్స్ తరహాలో వైసీపీ భూ కబ్జాలపై త్వరలోనే విశాఖ ఫైల్స్ విడుదల చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ భూ ఆక్రమణల్లో సీఎస్ స్థాయిలో పనిచేసిన వ్యక్తులున్నారని వెల్లడించారు. 

అందులో ప్రజా ప్రతినిధులు ఎవరెవరున్నారు, కడప గ్యాంగ్ ప్రమేయం ఏమిటి, భీమిలి భూములు, పెందుర్తి భూములు... ఇలా అన్ని వివరాలతో త్వరలోనే విశాఖ ఫైల్స్ తీసుకువస్తామని చెప్పారు. ప్రస్తుతం దానికి సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయని వివరించారు. సీఎస్ నుంచి, రిటైర్డ్ సీఎస్ లు కూడా ఇందులో ఉన్నారని తెలిపారు. విశాఖలో వైసీపీ భూదందాలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అన్నారు. 

ఇక, కొత్తగా ఆక్రమణలకు తావులేకుండా పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తాం అని గంటా స్పష్టం చేశారు.
Visakha Files
Ganta Srinivasa Rao
Visakhapatnam
TDP

More Telugu News