TTF Vasan: బిగుసుకుంటున్న ఉచ్చు.. తిరుమల భక్తులకు తమిళ యూట్యూబర్ క్షమాపణలు

Tamil youtuber TTF Vasan released apology video
షార్ట్స్‌లో చూడండి
తమిళనాడు యూట్యూబర్ టీటీఎఫ్ వాసన్ తిరుమల శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు నిన్న ఓ వీడియోను విడుదల చేశాడు. ఇటీవల శ్రీవారి దర్శనం కోసం స్నేహితులతో కలిసి వచ్చిన వాసన్ క్యూలో ఉండగా నారాయణగిరి షెడ్స్ కంపార్ట్‌మెంట్‌లో వేచి ఉన్నాడు. ఈ క్రమంలో భక్తులను వదిలేందుకు దాని తాళాలు తీస్తున్నట్టు హడావుడి చేస్తూ ప్రాంక్ వీడియో షూట్ చేశాడు. 

అతడిని టీటీడీ సిబ్బందిగా భావించిన భక్తులు నిజంగానే కంపార్ట్‌మెంట్ తాళాలు తీస్తున్నాడని భావించారు. వారిని చూసి వెకిలిగా నవ్వుతూ వారు అక్కడి నుంచి తప్పుకున్నారు. ఈ వీడియోను వారు ఆ తర్వాత తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు.

ఈ వీడియోపై తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఈ విషయం టీటీడీ దృష్టికి రావడంతో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. టీటీడీ విజిలెన్స్ శాఖ విచారణకు ఆదేశించింది.

తన మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందని భావించిన వాసన్ నిన్న క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశాడు. తాము కూడా శ్రీవారి భక్తులమేనని, భక్తుల ఇబ్బందులను చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీశామని, అయితే మిత్రుడి చర్యల కారణంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇకపై ఇలాంటి వీడియోలకు దూరంగా ఉంటామని, తమను మనస్ఫూర్తిగా క్షమించాలని వేడుకున్నాడు. కాగా, నిందితుల కోసం తిరుమల పోలీసులు గాలిస్తున్నారు.
Go Back to Shorts
TTF Vasan
TTD
QueQue Line
Narayanagiri Complex
Prank Video

More Telugu News