Jammu And Kashmir: బిడ్డలకు తాను తండ్రిని కాదన్న భర్త.. నవజాత కవలలను గొంతుకోసి చంపిన తల్లి

Woman Slits Throats Of Newborn Twins After Husband Says Hes Not The Father
  • జమ్మూకశ్మీర్‌లో ఘటన
  • భర్త సౌదీ నుంచి వచ్చిన మూడు నెలలకే మహిళ ప్రసవం
  • వారు తన సంతానం కాదంటూ భర్త పోలీసులకు ఫిర్యాదు
  • సమస్య తప్పదన్న భయంతో కన్నబిడ్డలను కడతేర్చిన మహిళ
నవజాత కవలలను కన్నతల్లి గొంతు కోసి చంపిన దారుణ ఘటన జమ్మూకశ్మీర్‌లో తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పూంచ్ జిల్లాకు చెందిన ఓ మహిళ భర్త చాలా కాలం పాటు సౌదీ అరేబియాలో గడిపి, మూడు నెలల క్రితమే ఇంటికి తిరిగొచ్చాడు. ఆ తరువాత కొన్ని రోజులకే ఆ మహిళ ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది.

 దీంతో, ఆ బిడ్డలు తన సంతానం కాదంటూ భర్త పోలీసులను ఆశ్రయించాడు. భార్యకు అక్రమ సంబంధం ఉందని ఆరోపించాడు. దీంతో, తనకు సమస్యలు తప్పవని భావించిన మహిళ నవజాత శిశువులను సమీపంలోని పొలంలోకి తీసుకెళ్లి గొంతు కోసి చంపేసింది.

ఈ దారుణానికి మహిళ భర్త కారణమని స్థానికులు ముందుగా భావించినా, పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మహిళను పోలీసులను ప్రశ్నించగా, ఆమె చివరకు చేసిన నేరాన్ని అంగీకరించింది. దీంతో, పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
Jammu And Kashmir
Crime News
woman kills newborn twins

More Telugu News