రైతుబంధుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నోటీసు... ఆ 16 లక్షలు తిరిగివ్వాలని ఓ రైతుకు ఆదేశాలు!
- వ్యవసాయేతర భూమిపై తీసుకున్న రైతుబంధు నిధులను వెనక్కివ్వాలని నోటీసులు
- మేడ్చల్ జిల్లా పోచారం గ్రామ రైతు యాదగిరి రెడ్డికి నోటీసులు
- వ్యవసాయేతర భూములకు రైతుబంధు తీసుకున్న లబ్ధిదారులందరి నుంచి రికవరీకి యత్నం
యాదగిరిరెడ్డి గతంలో 33 ఎకరాల భూమిని ఫ్లాట్లుగా చేసి విక్రయించినట్లు గుర్తించింది. ప్లాట్లుగా విక్రయించిన ఆ భూమిపై రైతుబంధు పేరిట అతను రూ.16 లక్షలు పొందినట్లు ప్రభుత్వం గుర్తించింది. వ్యవసాయేతర భూములకు రైతుబంధు తీసుకున్న లబ్ధిదారుల నుంచి కూడా రికవరీకి చర్యలను ప్రభుత్వం ప్రారంభించనుంది.