YV Subba Reddy: జగన్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు: వైవీ సుబ్బారెడ్డి

No need for Jagan to resign says YV Subba Reddy
  • జగన్ రాజీనామా చేస్తారంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్న సుబ్బారెడ్డి
  • రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా అవసరమని వ్యాఖ్య
  • ఇద్దరు సీఎంల సమావేశం మంచిదేనన్న సుబ్బారెడ్డి
మాజీ సీఎం జగన్ రాజీనామా చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. అనవసర దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. జగన్ రాజీనామా చేయరని... చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. గత ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని... ఇసుక పాలసీపై కావాలంటే విచారణ జరుపుకోవచ్చని అన్నారు. 

ఏపీ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా కావాల్సిందేనని సుబ్బారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాలే ఉన్నాయి కాబట్టి... విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి నిధులు రాబట్టాలని డిమాండ్ చేశారు. విభజన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావడం మంచి పరిణామమని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం కావాలనే కోరుకుంటున్నామని అన్నారు.
YV Subba Reddy
Jagan
YSRCP

More Telugu News