Palla Srinivasa Rao: ప్రజలు ఛీకొట్టినా సరే వైసీపీ హత్యారాజకీయాలు వీడడంలేదు: ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు

Palla Srinivasarao condemns TDO worker murder in Anantapur district
  • అనంతపురం జిల్లాలో ఆదెప్ప అనే టీడీపీ కార్యకర్త హత్య
  • వైసీపీ నేతలే కారణమంటున్న టీడీపీ 
  • ఆదెప్ప కుటుంబానికి అండగా ఉంటామన్న ఏపీ టీడీపీ చీఫ్
అనంతపురం జిల్లాలో ఆదెప్ప అనే టీడీపీ కార్యకర్త దారుణ హత్యకు గురికావడం తెలిసిందే. రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామానికి చెందిన 50 ఏళ్ల ఆదెప్పను ప్రత్యర్థులు నరికి చంపారు. పాతకక్షలే దీనికి కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎన్నికల్లో ప్రజలు ఛీకొట్టినా వైసీపీ హత్యారాజకీయాలు వీడడంలేదని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యకర్త ఆదెప్పను పొట్టనబెట్టుకున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. ఆదెప్ప కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
Palla Srinivasa Rao
Adeppa
Murder
TDP
Anantapur District

More Telugu News