కడప రైతు మూడేళ్ల సమస్యకు మూడు గంటల్లోనే పరిష్కారం!
- పొలంలోకి తీగలు వేలాడుతుండడంతో వ్యవసాయానికి ఇబ్బంది
- మూడేళ్లుగా ఇబ్బందిపడుతున్న నాగసానిపల్లె రైతు గంగయ్య
- ఫొటోలు వైరల్ కావడంతో స్పందించిన మంత్రి రవికుమార్
- అధికారులను పంపి సమస్యను పరిష్కరించిన వైనం
తాజాగా మళ్లీ సాగుకు కాలం కావడంతో నిన్న ఉదయం గంగన్న పొలానికి వెళ్లాడు. ఎప్పటిలానే తీగలు పైకెత్తి దుక్కి దున్నతుండగా కొందరు ఈ దృశ్యాలను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలు విద్యుత్తుశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. జిల్లా ఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ రమణతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. మంత్రి ఆదేశాలతో ఆయన వెంటనే గంగయ్య పొలానికి సిబ్బందిని పంపి విద్యుత్తు స్తంభం ఏర్పాటు చేసి తీగలను సరిచేశారు. మూడేళ్ల సమస్య మూడు గంటల్లో తీరినందుకు రైతు గంగయ్య ఆనందానికి హద్దే లేకుండా పోయింది.