Mohammad Siraj: మహమ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్‌లో ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం: రేవంత్ రెడ్డి

Revanth Reddy orders to place for house and job to Siraj
షార్ట్స్‌లో చూడండి
భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్ నగరంలో ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని సిరాజ్ ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా క్రికెటర్‌కు ఇంటి స్థలంపై ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇంటి స్థలం గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Go Back to Shorts
Mohammad Siraj
Revanth Reddy
Hyderabad
Telangana

More Telugu News